- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 27,254 కరోనా కేసులు నమోదుకాగా 219 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కు చేరగా 3,24,47,032 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,74,269 యాక్టివ్ కేసులుండగా కరోనాతో 4,42,874 మంది మృత్యువాతపడ్డారు.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేయగా దేశంలో కరోనా టెస్టులు 54,30,14,076కు చేరాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 20,240 కేసులుండగా 67 మంది మృతిచెందారు.
- Advertisement -