27 మందితో ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిట్

8
- Advertisement -

27 మంది సభ్యులతో జేఏసీ స్టీరింగ్ కమిటీ వేయడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ వెల్లడించింది. రేపు స్టీరింగ్ కమిటీ సమావేశం ఉంటుందని..సమావేశంలో సమస్యలపై చర్చ ఉంటుందని వెల్లడించారు. సమస్యల సాధనలో ఒక్క కార్యరూపం కావాలని చర్చించడం జరిగిందని..చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి.3 డిఎలు పెండింగ్ లో ఉన్నాయి.కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ డీఏ లు పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపింది.

మా ఉద్యోగుల బదిలీలు,317 జీవో ఇతర సమస్యలు ఉన్నాయి…మా మొదటి డిమాండ్ డీఏ లు వెంటనే విడుదల చేయాలి.పెండింగ్ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయన్నారు. సీపిఎస్ ను రద్దు చేస్తాం అని మ్యానిఫెస్టోలో పెట్టారు.దాన్ని కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది జేఏసీ.

సెప్టెంబర్ 1న సిపిఎస్ వచ్చింది ఆరోజును మేము చీకటి దినం గా భవిస్తూ తీర్మానం చేయడం జరిగిందని..10 సంవత్సరాల తరువాత ఒక్క జేఏసీ ఏర్పాటు చేసి ఒక్క స్టీరింగ్ కమిటీ వేసుకోవడం జరిగిందన్నారు. కొద్దిరోజుల్లోనే మరో కమిటీ వేస్తున్నాం.అన్ని సమస్యలు పరిస్కారం చేసుకుంటామన్నారు. 15వ ఆగస్టు అని ప్రభుత్వం చెప్పింది ఆ తేదీ అయిపోయింది .ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నామన్నారు.

Also Read:పోస్ట్ ప్రొడక్షన్‌లో ఈషా రెబ్బ మూవీ

- Advertisement -