పాత్ర కోసం ఎంతకైనా తెగిస్తారు కొందరు నటులు. వాళ్లలో టామ్ క్రూజ్ చియాన్ విక్రమ్ లాంటి నటుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి కోవలోకి బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హూడా కూడా చేరిపోయారు. ఒక సినిమా కోసం ఏకంగా నాలుగు నెలల్లో 26కేజీల బరువు తగ్గి ఔరా అనిపించారు. ఇది ప్రస్తుతం బాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాక్ గా నిలిచింది. అవును…రణ్‌దీప్ హూడా స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా స్వతంత్ర వీర్ సావర్కర్. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉండగా తాజాగా మూవీ మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ పాత్ర కోసం తనని తాను మార్చుకున్న విధానంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చిత్ర నిర్మాత ఆనంద్ పండిత్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రణ్‌దీప్ హూడా పూర్తిగా ఆ పాత్రలో లీనమైపోయారు. ఇందుకోసం సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు నుంచే సన్నద్ధమయ్యారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి 86కేజీల నుంచి 26కిలోలు తగ్గారు. ఆయన రోజు ఒక ఖర్జూర పండు ఒక గ్లాసు పాలు మాత్రమే తీసుకున్నారు. అంతేకాదు దామోదర్ సావర్కర్ పాత్ర కోసం గుండు కూడా చేయించుకున్నారు అని తెలిపారు.
Also Read: పిక్ టాక్: ట్రెండీ వేర్లో నాటీ ఫోజులు
టీజర్ విడుదల సందర్భంగా రణ్‌దీప్ హూడా మాట్లాడుతూ…సావర్కర్ అద్భుతమైన జీవితాన్ని గడిపారు. ఈ సినిమా కోసం ఆయన గురించి పరిశోదన చేసినప్పుడు అనేక విషయాలు తెలుసుకున్నా. ఆయన 140వ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈయేడాది వీర్ సావర్కర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపారు.
Also Read: మెగా మేనియా స్టార్ట్స్ సూన్