Maharashtra:బస్సులో మంటలు…25 మంది మృతి

53
- Advertisement -

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుల్దానాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. శనివారం ఉదయం 1.30 గంటల సమయంలో మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి.

ఏం జరుగుతుందో తెలిసేలోపే బస్సు పూర్తిగా దగ్ధమవడంతో అందులో ప్రయాణిస్తున్న 25 మంది సజీవ దహనమయ్యారు. డ్రైవర్‌ సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.

Also Read:‘మా ఊరి పొలిమేర‌-2’.. టీజ‌ర్

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొద్దిమంది పరిస్థితి విషమంగా ఉంది. ట్రావెల్స్‌ బస్సు నాగ్‌పూర్‌ నుంచి పుణె వెళ్తుండగా.. ఒక్కసారిగా టైరు పేలడంతో అదుపు తప్పిందని తర్వాత పక్కనే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడటంతో మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Also Read:‘సిద్ధార్థ్ రాయ్’ టీజర్ అదుర్స్..

- Advertisement -