బీజేపీ లోగోను తొలగించిన ఈటల

67
- Advertisement -

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీని వీడనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. కొంతకాలంగా రాజేందర్ బీజేపీని వీడుతున్నారని ప్రచారం జరుగగా బీజేపీని వీడే ప్రసక్తే లేదని ఇటీవలే చెప్పారు. అయితే తాజాగా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి బీజేపీ లోగోను తొలగించి, జీవోలో కేవలం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా అభివర్ణించారు.

దీంతో ఆయన బీజేపీని వీడటం ఖాయంగా కనిపిస్తొంది. అయితే ఈటల కాంగ్రెస్‌లో చేరుతారా లేదా సొంతగూటి అయిన బీఆర్ఎస్‌లో చేరుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు ఈటలను ఆ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం.

Also Read:‘సిద్ధార్థ్ రాయ్’ టీజర్ అదుర్స్..

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఈటలతో చర్చించినట్లు సమాచారం. కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వీరు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక రాష్ట్ర బీజేపీలో ఏ నాయకుడైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే ఎన్వీ సుబాష్ అనుమతి తీసుకోవాల్సిందే. దీనికి తోడు తెలంగాణలో అధికారంలోకి రాకపోవచ్చనే నిర్ణయానికి బీజేపీ నేతలు వచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలామంది నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Also Read:వీటితో కొలెస్ట్రాల్‌ కు చెక్ పెట్టండి…

- Advertisement -