ఫర్హాన్-శ్రద్ధ తెల్లారేదాకా…తెగ ఎంజాయ్‌

340
Shraddha Kapoor admits dating Farhan Akhtar
- Advertisement -

సెలెబ్రిటీలు లవ్‌లో ఉండడం కామన్‌. కానీ..ఆ లవ్‌కి కాస్త స్వేఛ్చ దొరికితే..? ఇంకేముంది.. వదిలే ప్రసక్తే లేదు. సందు దొరికితే చాలు రొమాన్స్‌ లో మునిగిపోతారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఉన్న ఇద్దరు సెలెబ్రిటీల మధ్య ప్రేమకథ ఘాటుగానే ఉందట. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, సహజీవనం కూడా చేస్తున్నారని ఇప్పటికే బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తల్లో నిలిచిన ఆ ఇద్దరే ఫర్హాన్ అక్తర్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్.

 Shraddha Kapoor admits dating Farhan Akhtar

వీరిద్దరి గురించి ఎన్ని రూమర్స్‌ బయటపడుతున్నా…వీరు మాత్రం నోరు విప్పట్లేదు. పోనీ అలా అయినా ఉన్నారా అంటే…అదీ లేదు. ప్రతి సారీ ఏదో విధంగా మీడియాకు చిక్కుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే..తాజాగా ఇప్పుడు మరోసారి ఈ ప్రేమజంట మళ్ళీ మీడియా కంటపడింది.

శ్రద్ధాకపూర్ మొన్న శనివారం రాత్రి ఫర్హాన్ ఇంటికి వెళ్ళిందట. ఈ విషయంపై ‘స్పాట్ బాయ్’ ఒక ప్రత్యేక కథనాన్నిస్తోంది. అయితే  శ్రద్ధాకపూర్ చాలా తెలివిగా వ్యవహరించిందట. జూహూ ప్రాంతంలోని ఫర్హాన్ ఇంటికి తన కారులో చేరుకున్న శ్రద్ధ.. ఆ వెంటనే కారును అక్కడ నుంచి పంపించి వేసిందని ‘స్పాట్ బాయ్’ పేర్కొంది. ఇక మీడియా వర్గాలు ఆ కారును వెంబడించుకొంటూ వెళ్లాయని.. ఆ విధంగా వారిని డైవర్ట్ చేసి.. తను మాత్రం ఫర్హాన్ ఇంటికి చేరిపోయిందనేది ఆ కథనం సారాంశం.

Shraddha Kapoor admits dating Farhan Akhtar

ఇప్పుడిదే న్యూస్‌ బాలీవుడ్‌ లో హాట్ టాపిక్‌ అయింది.  శ్రద్ధా రాత్రి ఎనిమిదింటికి పర్హాన్ ఇంటికి చేరిందని.. మళ్లీ తెలవారుతుండగా రెండు, మూడు గంటల సమయంలో.. శ్రద్ధా కారు మళ్లీ ఫర్హాన్ ఇంటి దగ్గరకు వచ్చిందని, అప్పటి వరకూ పర్హాన్ ఇంట్లోనే ఉన్న ఆమె, తిరిగి కారులో ఇంటికి వెళ్లిపోయిందని బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే అక్కడి పత్రికలు మాత్రం రాత్రి ఎనిమిదన్నర నుంచి తెల్లవారుఝాము రెండున్నర వరకూ పర్హాన్ ఇంట్లో  ఏం జరిగిందనేది..పాఠకుల ఊహకే వదిలేశాయి. ఇక ఈ విషయం తెలుసుకున్నవారంతా ఆ రాత్రి ఏంజరిగి ఉంటుందోననే గుసగుసలు..మరోవైపు మీడియా వర్గాలు ఇస్తున్న సమాచారం కూడా చాలా హాట్‌గానే ఉన్నాయి.  ఇక ఈ న్యూస్‌తో ఫర్హాన్, శ్రద్ధాల రొమాన్స్ స్పైసీగానే ఉందని బాలీవుడ్‌ వర్గాల అభిప్రాయం. ఇప్పటికే తెల్లవారుఝాము వరకూ కూతురు ఇంటికి రావడం లేదని శక్తి కపూర్ తలపట్టుకుంటున్నాడట.

- Advertisement -