- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గముఖం పట్టాయి. గత 24 గంటల్లో 2503 కరోనా కేసులు నమోదుకాగా 27 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,93,494కు చేరగా 4,24,41,449 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36,168 యాక్టివ్ కేసులుండగా 5,15,877 మంది కరోనాతో మృతిచెందారు.
రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.47 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.08 శాతం మాత్రమేనని వెల్లడించింది. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,79,91,57,486 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -