శ్రీలంకలో మరో బాంబు దాడి..

145
Fresh blast in Colombo

శ్రీలంక వరుస బాంబు దాడులతో వణికిపోతుంది.. కొలంబొలో ఇటీవల ఈస్టర్‌ సండేరోజు జరిగిన పేలుళ్ల ఘటన మర్చిపోక ముందే మరో పేలుడు సంభవించింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీ చేస్తున్నప్పటికీ ఎక్కడో ఓ చోట ఈ పేలుడు సంభవిస్తూనే ఉంది.

తాజాగా బుధవారం ఏకంగా సినిమా థియేటర్‌నే దుండగులు టార్గెట్‌ చేశారు. కొలంబోని సావోయ్‌ థియేటర్‌ సమీపంలోని ఓ మోటార్‌ బైక్‌లో బాంబు ఉందని గ్రహించిన పోలీసులు దాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో అది పేలింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ పెద్దగా జనాలు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

శ్రీలంకలో ఈస్టర్‌ సండేరోజు జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం జరుపుతున్న గాలింపు చర్యలు ముమ్మరంగా సాగినట్లు పోలీసులు తెలిపారు.