భారీ వరదలు..23 మంది జవాన్లు గల్లంతు

42
- Advertisement -

భారీ వరదలతో ఈశాన్య రాష్ట్రం సిక్కిం అతలాకుతలమైంది. భారీ వర్షాలతో 23 మంది జవాన్లు గల్లంతయ్యారు. గల్లంతైన సైనికుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సిక్కింలో కుండపోత వర్షం కురుస్తుండటంతో తీస్తా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతొ ఒక్కసారిగా నీటి మట్టం పెరిగి అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి.

వరదలకు సింగ్టామ్ సమీపంలోని బర్దాంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు కొట్టుకుపోయాయి. వాహనాలతోపాటే 23 మంది జవాన్లు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 41 వాహనాలు నీటిలో మునిగిపోగా వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం కూడా సరిగ్గా లేదు. దీంతో గల్లంతైన సిబ్బందిని గుర్తించడం కష్టంగా మారిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

తీస్తా నది బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది. తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్ ఫ్రూట్ బ్రిడ్జి కుప్పకూలింది. సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి సైతం చాలా చోట్ల కొట్టుకుపోయింది.దీంతో సిక్కిం ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక చర్యలు చేపడుతున్నామని సీఎం ప్రేమ్ సింగ్ తెలిపారు.

Also Read:Bigg Boss 7 Telugu: కెప్టెన్సీ టాస్క్ రచ్చరచ్చ

- Advertisement -