క‌రోనా బాధితుల‌కు అండ‌గా మెగాస్టార్ చిరంజీవి..

135
- Advertisement -

ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కొంత కారణం ఆక్సిజన్‌ కొరత కూడా. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ కొరత వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో క‌రోనా బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. ఆక్సిజ‌న్ కొర‌త దృష్ట్యా చిరంజీవి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ ఆక్సిజ‌న్ బ్యాంకులు వారం రోజుల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఆక్సిజ‌న్ ట్యాంకుల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను అభిమాన సంఘాల జిల్లా అధ్య‌క్షుల‌కు అప్ప‌గించ‌నున్నారు. దీని కోసం ఓ ట్విట్టర్‌ ఖాతాను కూడా ప్రారంభించారు.

- Advertisement -