దేశంలో 24 గంటల్లో 60 మంది మృతి

63
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 21,880 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా కాగా 60 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,38,47,065కు చేరగా 4,31,71,653 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,49,482 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు కరోనాతో 5,25,930 మంది మృతిచెందారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.25 శాతానికి చేరగా మొత్తం కేసుల్లో 0.34 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.46 శాతానికి చేరాయి, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 201.30 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -