- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2,11,298 పాజిటివ్ కేసులు నమోదుకాగా 3847 మంది మృతిచెందారు. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093కి చేరగా 2,46,33,951 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 24,19,907 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు కరోనాతో 3,15,235 మంది మృతిచెందారు. టీకా డ్రైవ్‌లో 20,26,95,874 డోసులు పంపిణీ చేయగా దేశంలో కరోనా రికవరీ రేటు 90.01శాతానికి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 33,69,69,352 నమూనాలను టెస్ట్ చేసినట్లు వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -