- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 20,409 కరోనా కేసులు నమోదుకాగా 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,43,988 కేసులు యాక్టివ్గా ఉండగా , 5,26,258 మంది మరణించారు.
మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 203.60 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -