2029 నో ఎలక్షన్స్..మోడీ ప్లాన్ అదే!

28
- Advertisement -

కేంద్రంలో గత పదేళ్ళు గా ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా హ్యాట్రిక్ విజయం కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ప్రధానంగా మోడీ మేనియాతోనే గత రెండు సార్లు అధికారం సాధించిన బీజేపీ ఈసారి కూడా మోడీ ద్వారానే అధికారాన్ని ఆశిస్తోంది. అయితే మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశ స్థితిగతులే మారిపోతాయా ? అంటే అవుననే అంటున్నారు ప్రతిపక్ష నేతలు. మూడో సారి మోడీ ప్రధాని అయితే నియంతగా మారతారని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తామరాని ఇతర పార్టీల నేతలు తరచూ విమర్శలు చేస్తున్నారు. ఈ రకమైన విమర్శలు మామూలే అయినప్పటికి ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. .

దేశంలో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తే 2029 లో ఎలక్షన్స్ ఉండే అవకాశం లేదని ఏకీకృత పాలనకు బీజేపీ తెర తీస్తుందని ఆయన అన్నారు. అన్నీ వ్యవస్థలను గుప్పిట్లో ఉంచుకొని పార్టీలను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఆశ్చర్యం లేదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం కూడా లేకపోలేదు, గత పదేళ్ళలో ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా ఎన్నో కేసులు బయట పడుతున్న సంగతి తెలిసిందే. ఇతర పార్టీల నుంచి చాలమంది నేతలను బీజేపీలో కలుపుకున్నారు కూడా.

ఇక ముందు రోజుల్లో ప్రతి రాష్ట్రంలోని బీజేపీ ఆధిపత్యం కనబరిచే ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఇతర ప్రభుత్వాలను పడగొట్టి అధికారం చేజిక్కించుకున్న బీజేపీ.. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆ తరహా రాజకీయానికి మరింత పదును పెట్టె అవకాశం లేకపోలేదు. ఇక ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ పేరుతో ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికలను రద్దు చేసే ప్రణాళికలకు పదును పెడుతున్న బీజేపీ.. ఈసారి ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే ఎలక్షన్ పట్రాన్ పూర్తిగా ఛేంజ్ చేసిన ఆశ్చర్యం లేదనేది కొందరి అభిప్రాయం. మరి 2029 నాటికి దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:Allu Arjun: హ్యాపీ బర్త్ డే బన్నీ

- Advertisement -