గత కొన్నాళ్లుగా దేశంలో ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ ఖర్చు తగ్గించేందుకు అలాగే రాష్ట్రాలను ఒకే తాటిపై నడిపేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకే సారి ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రస్తుతం ఉన్న మోడీ సర్కార్ భావిస్తూ వచ్చింది. అయితే దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించడం సాధ్యమేనా అంటే దాదాపు అసాధ్యమనేది విపక్షాలు చెబుతున్న మాట. ఎందుకంటే ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వాలు కూలిపోవడం, మద్యంతర ఎన్నికలు రావడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సందర్భంలో దేశమంతా ఒకే ఎన్నికలు నిర్వహించడం కష్టతరమే.
ఈ నేపథ్యంలో ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ అంశాన్ని బీజేపీ ఎందుకు తెరపైకి తెచ్చినట్టు అనే ప్రశ్న రాక మానదు. అయితే అప్పుడప్పుడు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎలక్షన్ ఖర్చు భారీగా పెరిగే అవకాశం ఉంది. అందువల్ల కేంద్ర బడ్జెట్ లో మెజారిటీ శాతం ఎలక్షన్స్ కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది.. ఆందుకే ఎలక్షన్ ఖర్చు తగ్గించేందుకు సార్వత్రిక ఎన్నికలతో పాటు అన్నీ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించాలనేది ప్రస్తుతతమున్న మోడీ సర్కార్ ప్లాన్. దీనిపై ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కమిటీ ఇచ్చిన నివేధికాల ఆధారంగా ఒన్ నేషన్ ఒన్ ఎలక్షన్ సాధ్యమే అనేది బీజేపీ చెబుతున్న మాట. తాజా ప్రధాని మోడీ దీనిపై స్పందించడంతో భవిష్యత్ లో దేశమంతా ఒకే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశమంతా ఉమ్మడి పౌరసత్వాన్ని అమలు చేస్తామని, దానితో పాటు దేశమంతా ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తామని ప్రధాని మోడి వెల్లడించారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తే 2029 తో జమిలి ఎన్నికలు ఖాయమనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మరి ముందు రోజుల్లో ఎలక్షన్ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Also Read:రికార్డులు క్రియేట్ చేస్తున్న..పుష్ప-2