OTT:ఈ వారం ఓటీటీ సినిమాలివే

1
- Advertisement -

ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు అలరించేందుకు రెడీగా ఉన్నాయి. థియేటర్లలో మార్చి 18న ధురంధర్ 2, 19న పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల కానున్నాయి.

ఇక ఓటీటీల విషయానికొస్తే..

10/G Railway Quarters. రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ఈ భావోద్వేగ డ్రామా ఇప్పటికే ఈటీవీ విన్‌లో విడుదలైంది. ఇది “కథా సుధ” అనే ఆంథాలజీ సిరీస్‌లో భాగం. దర్శకుడు జై తెరకెక్కించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

Landlord..దునియా విజయ్ నటించిన యాక్షన్ డ్రామా మార్చి 19న ZEE5లో స్ట్రీమింగ్‌కు రానుంది. జనవరిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపలేదు. తెలుగు వెర్షన్ అందుబాటులో ఉండకపోవచ్చు.

The Housemaid అనే సైకాలజికల్ థ్రిల్లర్‌ మార్చి 19 నుంచి Amazon Prime Videoలో రూ.149 చెల్లించి రెంట్‌కు చూడవచ్చు. సన్ని డియోల్ ప్రధాన పాత్రలో నటించిన దేశభక్తి నేపథ్యంలో రూపొందిన బోర్డర్ 2 మార్చి 20 నుంచి Netflixలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో అందుబాటులో ఉండదు.

ఐశ్వర్య అర్జున్, నిరంజన్ సుదీంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన Seetha Payanam బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమా మార్చి 20 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది. దివ్య దత్త ప్రధాన పాత్రలో నటించిన ఈ హిందీ వెబ్ సిరీస్ Chiraiya. వివాహిత మహిళలపై జరిగే లైంగిక హింస వంటి సున్నిత అంశాలను ఈ సిరీస్‌లో చూపించారు. మార్చి 20న Jio Hotstarలో విడుదల కానుంది.

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ప్రధాన పాత్రల్లో నటించిన జటాధర అనే హారర్ యాక్షన్ డ్రామా మార్చి 20 నుంచి ZEE5లో హిందీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read:2027 వరల్డ్ కప్‌ గెలవడమే టార్గెట్!

- Advertisement -