భారతీయ జనతా పార్టీ ప్రజలకిచ్చిన హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. చెన్నైలో ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన 2024ఎన్నికలు-ఎవరు విజయం సాధిస్తారు అనే అంశం జరిగిన చర్చా కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారదర్శకత నిబద్దతతో పాలన అందించడంలో విఫలమైందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… గడిచిన పదేళ్లలో ప్రధాని మోదీ ఏం చేశారని కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ బీఆర్‌ఎస్ గా మారి దేశవ్యాప్తంగా భావసారుప్యత ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులకు ఇవ్వాల్సిన పీఎం కిసాన్ పథకంను రానురాను తగ్గించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి అవినీతికి, అక్రమాలకు పాల్పడకపోతే, అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయడం లేదని, అక్రమాలకు పాల్పడ్డ కంపెనీని ఎందుకు రక్షిస్తున్నారని కవిత ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో గంటన్నర సేపు మాట్లాడిన ప్రధాని మోదీ, అదానీ కుంభకోణంపై ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం, ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో మోదీ వచ్చేముందు సీబీఐ ఈడీ వస్తాయని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం అసత్యాలను మోదీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఎమ్మెల్సీ కవిత చేసిన ప్రసంగానికి సభకు హాజరైన సభ్యులు హర్షధ్వానాలతో అభినందించారు.
ఇవి కూడా చదవండి…