2024..అయోధ్య భవ్యమందిరం దర్శనం

33
- Advertisement -

అయోధ్యలోని భవ్య రామ మందిరంను వచ్చేయేడాది జనవరి నాటికి దర్శనమిచ్చేందుకు సిద్దం చేస్తున్నామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. భవ్యరామ మందిర నిర్మాణం దాదాపుగా పూర్తికావస్తోందని తెలిపారు. ఇప్పటికే చాలావరకు రామాలయం పనులు పూర్తయ్యాయి. 2024 జనవరి 1వ తేదీన రామమందిరాన్ని భక్తుల కోసం ఓపెన్‌ చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు. అయితే రామ్‌లల్లా విగ్రహం కోసం నమూనాలను పంపాలని దేశంలోని ప్రముఖ శిల్పులను కోరింది. ఒడిశాకు చెందిన ప్రముఖ శిల్పులు సుదర్శన్ సాహు, వాసుదేవ్ కామత్, కె.వి., కర్నాటకకు చెందిన మానియా, పూణెకు చెందిన శాస్త్రజ్య దేవుల్కర్… 9 నుంచి 12 అంగుళాల విగ్రహం నమూనాలను పంపనున్నారు. వీరు పంపిన నమూనాలో ఒక దానిని ట్రస్ట్‌ ఎంపిక చేయనున్నట్టు తెలిపారు.

రామాలయ నిర్మాణ పనులను శరవేగంగా చేస్తున్నామని తెలిపారు. వాస్తు విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదని రామజన్మభూమి ట్రస్ట్‌ ప్రకటించింది. శ్రీరాముడు జన్మించిన నవమి రోజున 12గంటలకు సూర్యుడి కిరణాలు రామ్‌లలా నుదుటిపై పడే విధంగా డిజైన్ చేశామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. ఇందుకోసం సీఎస్‌ఐఆర్-సీబీఆర్‌ఐ రూర్కీ, ఇంటర్ యూనివర్సటీ సెంటర్‌ ఫర్ ఆస్ట్రానమీ అండ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ పుణే, ప్రఖ్యాత ఆలయ ఆర్కిటెక్ట్‌ల బృందం పర్యవేక్షణలో గర్భగుడి నిర్మాణం జరగుతుందని అన్నారు.

వాస్తు శాస్త్రంలోని నీలాంబుజ్‌ శ్యామలకోమలాయిగ్ అనే శ్లోకం ఆధారంగా రాముడి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఆయోధ్య నిర్మాణం కోసం 2021 జనవరిలో భూమిపూజ చేశారు. రాముడి ఆలయ నిర్మాణం తర్వాత ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటారని…దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అయోధ్యకు వచ్చే యాత్రికుల కోసం ఎలాంటి ఆసౌకర్యం కలగకుండ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిరంతరం ఏర్పాట్లును పర్యవేక్షిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి…

రేపట్నుంచి జల్లికట్టు…

గంగా విలాస్ క్రూయిజ్..ధర ఎంతంటే..?

ఉక్రెయిన్‌తో యుద్దం..పుతిన్‌ సంచలన ప్రకటన

- Advertisement -