మరో 18 రోజుల్లో 2023కు ముగింపు పలకనున్నాం. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండగా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు ఘన విజయం సాధించి హీరోలకు హిట్ ఇవ్వగా మరికొంతమంది హీరోలకు మాత్రం పీడకలనే మిగిల్చింది. ఇందులో టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, ప్రభాస్,రవితేజ, సమంత వంటి నటులు ఉన్నారు.
వేదాళం రీమేక్‌గా వచ్చిన భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. చిరు సినిమాతో తనకు కమ్ బ్యాక్ వస్తుందని భావించిన మెహార్ రమేష్‌కు నిరాశ ఎదురైంది. ఇక హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఏజెంట్ నిరాశే మిగిల్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.
ఇక ప్రభాస్‌కు ఈ ఏడాది ఖచ్చితంగా వరెస్ట్ సంవత్సరమే చెప్పాలని. ఎందుకంటే ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. బోయపాటి శ్రీను – రామ్ పోతినేని కాంబోలో వచ్చిన మాస్ మూవీ స్కంద. మితిమీరిన వయలెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకులేక పోయింది.
ఇక రవితేజ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. వక్కంతం వంశీ- నితిన్ కాంబోలో వచ్చిన ఎక్స్‌టార్డినరీ మ్యాన్‌ది ఇదే పరిస్థితి. గుణశేఖర్ శాకుంతలం సైతం డిజాస్టర్‌నే మూటగట్టుకుంది. మహా భారతంలోని శకుంతల కథని ఈ చిత్రంలో చూపించగా సమంత స్టార్ డమ్ కూడా ఈ చిత్రాన్ని గట్టెక్కించలేకపోయింది. శ్రీవాస్ దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా వచ్చిన రామబాణంది ఇదే పరిస్థితి. మరో ఫ్లాప్‌ను గోపిచంద్ ఖాతాలో వేసింది. ఇలా వీరితో పాటు పలువురు హీరోలకు 2023 పీడకలనే మిగిల్చింది.
Also Read:ప్రేక్షకులను మెప్పించే ‘పిండం’