TTD:తిరుమల అప్‌డేట్

38
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 9 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచిఉండగా టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 5 గంటల సమయం పడుతోంది. ఇక జూన్ 29 నుండి జూలై 7 వరకు శ్రీ సిద్దేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జూన్ 29న ఉదయం 7.38 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మో త్సవాలు ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.

Also Read:వెల్లుల్లి రసంతో ఎన్ని ఉపయోగాలో.. !

జూన్ 30న సాయంత్రం చంద్రప్రభ వాహనం, జులై 1న‌ సాయంత్రం చిన్నశేష వాహనం, 2న సాయంత్రం సింహ వాహనం, 3న సాయంత్రం నంది వాహ‌న‌సేవ జ‌రుగుతాయని వెల్లడించారు. జులై 4న సాయంత్రం 6 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుందన్నారు. జులై 5న సాయంత్రం పల్లకీ సేవ, 6న సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం, 7న ఉదయం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వ‌ర‌కు త్రిశూలస్నానం, సాయంత్రం 5 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని అధికారులు వెల్లడించారు.

Also Read:” గుంటూరు కారం ” కాపీ కథనా ?

- Advertisement -