ఈ వారం భారీ సినిమా పవన్ కళ్యాణ్ – సాయి తేజ్ ‘బ్రో’ సినిమా రాబోతుంది. అందుకే, మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే మరోవైపు ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకులు ఈ వారం కూడా ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా రాబోతున్న చిత్రాల పై ఓ లుక్ వేద్దాం రండి
ముందుగా, ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
పవన్ కల్యాణ్ ‘బ్రో’ చిత్రం :
పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. త్రివిక్రమ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించాడు. ఈ ‘బ్రో’ జులై 28న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
‘స్లమ్ డాగ్ హస్బెండ్’ :
సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ప్రణవి మానుకొండ కథానాయిక. ఈ నెల 29న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
ఈ వారం ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే :
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
డ్రీమ్ (కొరియన్ మూవీ) జులై 25 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మామన్నన్ (తమిళ్/తెలుగు) జులై 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
పారడైజ్ (హాలీవుడ్) జులై 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
హిడెన్ స్ట్రైక్ (హాలీవుడ్) జులై 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
హ్యాపీనెస్ ఫర్ బిగినెర్స్ (హాలీవుడ్) జులై 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
హౌ టు బికమ్ ఎ కల్ట్ లీడర్ జులై 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ లో ప్రసారాలు ఇవే :
ఆషిఖానా (హిందీ సిరీస్) జులై 24 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోనీలివ్ లో ప్రసారాలు ఇవే :
ట్విస్టెడ్ మెటల్ (వెబ్‌సిరీస్) జులై 28 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బుక్ మై షో లో ప్రసారాలు ఇవే :
జస్టిస్ లీగ్: వార్ వరల్డ్ (యానిమేషన్ మూవీ) జులై 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ట్రాన్స్‌ఫార్మర్స్:రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) జులై 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ద ఫ్లాష్ (హాలీవుడ్) జులై 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జియో సినిమాలో ప్రసారాలు ఇవే :
లయనెస్ (హాలీవుడ్) జులై 23 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
కాల్‌కూట్ (హిందీ) జులై 27 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మనోరమా మ్యాక్స్ లో ప్రసారాలు ఇవే :
కొళ్ల (మలయాళం) జులై 27వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.