2023..ఫీమేల్ సెంట్రిక్ వెబ్‌సిరీస్‌లు ఇవే.!

33
- Advertisement -

ఆర్య సీజన్-3
మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ నటిస్తోన్న ఆర్య సీజన్3. ఈ సీజన్ కోసం సుస్మితా భారీ యాక్షన్ ప్లాన్‌ తెరకెక్కిన ఆర్య సీజన్‌3.తన కుటుంబం కోసం నేర ప్రపంచంను ఏవిధంగా ఎదురించి నిలబడ్డ నటిగా ఇందులో కనిపించనుంది. అయితే ఈ వెబ్‌సిరీస్ అధికారికంగా విడుదల తేదీని ఖరారు చేయలేదు. కానీ డిస్నీ+హాట్‌స్టార్‌లో మాత్రం స్ట్రీమింగ్‌ కానుంది.

దహాద్
పబ్లిక్ బాత్‌రూమ్‌లో చనిపోయిన స్త్రీల కేసులను సాల్వ్‌ చేసే పోలీస్‌ పాత్రలో కనిపించనుంది బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా. ఈ సిరీస్‌లో అంజలి భాటి అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ కనిపించనుంది. దహాద్ వెబ్‌సిరీస్‌ను 8భాగాలుగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్ధమైంది. అయితే దీన్ని మే 12న అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ కానుంది. అన్నట్టు నాని నటించిన ఎంసీఏ ఫేమ్ విలన్ విజయ్ వర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Also Read: ‘ఎన్టీఆర్ 30’.. మళ్లీ లీకుల కలకలం

సాస్ బహు ఔర్ ఫ్లెమింగో
డింపుల్ కపాడియా, రాధిక మదన్, అంగీర ధర్, ఇషా తల్వార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్‌సిరీస్ సాస్ బహు ఔర్ ఫ్లెమింగ్. ఈ సినిమా కఠినమైన క్రూరమైన అత్త మరియు సాత్వికమైన కోడళ్ల మధ్య జరిగే దారావాహిక. సేస్ బహు వెబ్ సిరీస్‌లో భాగంగా సరికొత్తగా అంతకు మించి అన్నట్టుగా నిర్మించారు. ఇది మే5న డిస్నీ+హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ది గుడ్ వైఫ్
అమెరికన్ కోర్ట్‌ రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ది గుడ్‌ వైఫ్‌. ఈ సిరీస్‌లో కాజోల్‌ జూలియానా మార్గులీస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తన భర్త ఓ కుంభకోణం కేసు విషయంలో జైలులో ఉండగా.. భర్తను ఏవిధంగా భార్య రక్షించుకుందనేది ఈ సిరీస్‌లో చూడవచ్చు. ఈ సిరీస్‌ మొత్తం ఆరు సీజన్‌లు రాగా తాజాగా 7వ సీజన్. ఈసినిమాను సుపాన్ వర్మ దర్శకత్వం వహించారు.

Also Read: మహేష్ తో ల‌వ్ ట్రాక్.. హిలేరియ‌స్‌

హీరమండి
1940ల నాటి భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో హీరామండి అనే వేశ్యల ఇతివృత్తంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్‌. ఈ సిరీస్‌ను సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో మనీషా కొయిరాలా సోనాక్షి సిన్హా అదితి రావ్ హైదరీ రిచా చద్ధా షర్మిన్‌ సెగల్ సంజీదా షేక్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

- Advertisement -