2024కు 2023 ఎన్నికల రిహార్సల్స్‌

83
- Advertisement -

దేశ రాజకీయాల్లో ఎన్నికలు అనేవి చాలా కీలకమైనవి. ఏరాష్ట్రంలో ఎప్పుడూ ఎన్నికలు వస్తాయో చెప్పడం కష్టతరమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు అన్ని కూడా ఒక సవాళ్లతో కూడిన పనిగా చెప్పవచ్చు. అంతేకాదు…2022వ సంవత్సరం కూడా ఎన్నికలతోనే గడిచిపోయింది.

2024లో కేంద్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీలన్నీ 2023లో వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది సెమీ ఫైనల్స్‌ లాంటిది. అందులో కొన్ని రాష్ట్రాలు కీలకం కాగా మరికొన్ని రాష్ట్రాల్లో అమితూమీ అన్నట్టుగా సాగే అవకాశం ఉందని పలువురు విశ్లేషకుల అంచనా.

రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​, మిజోరాం రాష్ట్రాల్లో.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే జమ్ముకశ్మీర్​లో కూడా వచ్చే ఏడాదే ఎన్నికలు జరగొచ్చు. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు పోటి పడగా…2024నాటికి కమళదళంను ఓడించేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాయి.

రాజస్థాన్‌
రాజస్థాన్‌లో 2018లో ఎన్నికలు జరగ్గా అధికారంలోకి కాంగ్రెస్‌ పార్టీ వచ్చింది. అయితే మొదట్లో ఐక్యమత్యంతో ఉన్న చివరి సంవత్సరంలో సచిన్ పైలట్‌ ఆశోక్‌ గెహ్లాట్‌కు మధ్య మాటల యుద్ధం నిత్యం జరుగుతుంది. బీజేపీ, కాంగ్రెస్​ మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు తథ్యం! 1990 నుంచి ఇక్కడ.. అధికారం ఈ రెండు పార్టీల మధ్య చేతులు మారుతూ వస్తోంది. ఈ రాష్ట్రంపై బాజాపా గురిపెట్టగా ఏమేరకు విజయంను అందుకుంటారో తెలియాల్సి ఉంది. అయితే ఇటీవలే ముగిసిన హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఉత్సాహంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఏమేరకు తమ పార్టీని మరోసారి అధికారంలోకి తేవడానికి ప్రయత్నిస్తారో వేచి చూడాలి.

ఛత్తీస్‌గఢ్‌
ఛత్తీస్‌గఢ్‌కు2018లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌ 68స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. అయితే ఇటివలే జరిగిన భానుప్రతాపూర్​ ఉప ఎన్నికలోనూ విజయం కాంగ్రెస్​నే వరించింది. కానీ బీజేపీ కంచుకోటగా ఉన్న 15యేళ్ల పాలనను చరమగీతం పాడి 2018లో విజయం నమోదు చేసిన కాంగ్రెస్‌… ఈసారి కూడా కాంగ్రెస్‌కు పట్టం కడతారా లేదా అనేది 2023ఎన్నికల్లో తేలిపోతుంది.

మధ్యప్రదేశ్‌
మధ్యప్రదేశ్‌లో హైడ్రామాల మధ్య కొనసాగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకోంది. కానీ 2018లో కమల్‌ నాథ్‌సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ సందడి ఎక్కువ కాలం నిలవలేదు. రెండేళ్లకే పార్టీపై తిరుగుబాటు చేశారు జ్యోతిరాదిత్య సింథియ. పార్టీపై తీవ్ర అసంతృప్తితో.. బీజేపీలో చేరారు. దీంతో శివరాజ్​ సింగ్​ చౌహాన్​.. మరోమారు సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో అందరి పోకస్‌ మధ్యప్రదేశ్‌ ఎన్నికలపైనే ఉంది.

కర్ణాటక
కర్ణాటకలో ఎన్నికల చదరంగం ఆటలో రాజకీయ ఉత్కంఠను రేపింది. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అధికార బీజేపీ ప్రభుత్వం ఎక్కవ కాలం నిలవలేదు. కానీ జేడీఎస్‌తో పోత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టిన ఎక్కువ కాలం నిలబెట్టుకోలేక చతికిల పడింది. దీంతో మరోసారి కర్ణాటక బంతి బీజేపీ కోర్టులో పడడంతో విజయవంతంగా దాన్ని గోల్‌గా మార్చుకొని అధికారంను కైవసం చేసుంది.

తెలంగాణ
ఆరు నెలలకు ముందుగానే ఎన్నికలకు వెళ్లి విజయవంతంగా రెండోసారి సీఎం అయిన కేసీఆర్… ఈసారి మాత్రం తగ్గ ఫైట్ ఉంటుందని పలువురు రాజకీయ విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో జరిగిన గత ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీ అనూహ్యంగా బలపడి బీఆర్ఎస్‌ గట్టి షాక్ ఇవ్వాలని ఊవ్విళ్లూరుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో బీజేపీపై యుద్దం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి…ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈశ్యాన్య భారతం
త్రిపుర
2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే త్రిపురలో బీజేపీకి టీఎంసీకి మధ్య పార్టీల మధ్య హైటెన్షన్ వార్‌ నడుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాపడుతున్నారు.

మేఘాలయ
2018లో మేఘాలయలో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో…బీజేపీ చకచకా పావులు కదిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అయితే 2023లో త్రిముఖ పోరు నడిచేలా కనిపిస్తోందని పలువురు విశ్లేషుకుల అంచనా. నేషనల్​ పీపుల్స్​ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోరు సాగనుంది.

నాగాలాండ్‌
నాగాలాండ్‌లో ఎన్​డీపీపీ(నేషనల్​ డెమొక్రటిక్​ ప్రొగ్రెసివ్​ పార్టీ)తో కలిసి 2018 ఎన్నికల బరిలో దిగి బీజేపీ…. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మిజోరాం
మిజోరాంలో మీజో నేషనల్‌ ఫ్రంట్‌…జోరంథంగ సీఎంగా ఉన్నారు. అయితే ఇక్కడ 2018లో బీజేపీ ఖాతా తెరిచింది. అయితే 2023లో 15స్థానాలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. మొత్తమీద 2023 ఎన్నికలు ఒక సెమీఫైనల్‌ లాంటిదని పలువురు విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి…

తల్లి పాడే మోసిన ప్రధాని మోడీ..

పూజలకు సిద్దమైన వారాహి

పార్టీల పోరు.. పాదయాత్రల జోరు!

 

- Advertisement -