ఈ వారం ఓటీటీ & థియేటర్స్ కంటెంట్ ఇదే !

30
- Advertisement -

ఆగస్టు రెండో వారంలో కూడా థియేటర్‌ ల్లో కొన్ని చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అలాగే, మరోవైపు ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం స్ట్రీమింగ్‌ కానున్న కంటెంట్ పై ఓ లుక్ వేద్దాం రండి

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

రజనీకాంత్‌ ‘జైలర్‌’ :

‘ఓ రేంజ్‌ తర్వాత మన దగ్గర మాటలుండవ్‌.. కోతలే..’ అంటున్నారు
రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ రూపొందించిన చిత్రం ‘జైలర్‌’. తమన్నా కథానాయిక. ప్రముఖ నటులు మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, సునీల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 10న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

మెగాస్టార్ ‘భోళా శంకర్‌’ :

చిరంజీవి ‘భోళా శంకర్‌’గా సందడి చేసేందుకు సిద్ధమవ్వబోతున్నారు. ఈ చిత్రాన్ని మెహర్‌ రమేష్‌ తెరకెక్కించారు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

‘ఉస్తాద్‌’ :

శ్రీసింహా హీరోగా ఫణిదీప్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉస్తాద్‌’. ఆగస్టు 12న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతుంది.

ఈ వారం ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే :

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

గబ్బీస్‌ డాల్‌ హౌస్‌ (మూవీ) ఆగస్టు 07 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జాంబీవెర్స్‌ (కొరియన్‌) ఆగస్టు 08 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

హార్ట్‌ ఆఫ్ స్టోన్‌ (మూవీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇన్‌ అనదర్‌ వరల్డ్‌ విత్‌ మై స్మార్ట్‌ ఫోన్‌ (మూవీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పెండింగ్‌ ట్రైన్‌ (మూవీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :

ది కశ్మీర్‌ ఫైల్స్‌ అన్‌ రిపోర్టెడ్‌ (జీ ఒరిజినల్‌) ఆగస్టు 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అబర్‌ ప్రోలీ (బెంగాలీ) ఆగస్టు 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీలివ్‌ లో ప్రసారాలు ఇవే :

ది జంగబూరు కర్స్‌ (సోనీలివ్‌ ఒరిజినల్‌) ఆగస్టు 9 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

పొర్‌ తొళిల్ (తమిళ్‌/తెలుగు) ఆగస్టు 11 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారాలు ఇవే :

మేడ్‌ ఇన్‌ హెవెన్‌ (వెబ్‌సిరీస్) ఆగస్టు 10 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఆహా లో ప్రసారాలు ఇవే :

హిడింబ (తెలుగు) ఆగస్టు 10వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -