2022…బాలీవుడ్‌ టాప్‌ న్యూస్‌

263
- Advertisement -

2022వ సంవత్సరంలో బాలీవుడ్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బాయ్‌కట్ పర్వం కొనసాగింది. లాల్‌సింగ్ చడ్డా లైగర్ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు బాయ్‌కట్‌ను ఎదుర్కోన్నాయి. త్వరలోనే 2023వ సంవత్సరం వస్తోంది. కావున ఒకసారి చూద్దాము.

లాల్‌సింగ్ చద్దా

లాల్ సింగ్ చద్దా విడుదలకు ముందే ట్విట్టర్ వినియోగదారులు #boycottlaalsinghchaddha అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ సెట్ట్‌ చేసింది. సినిమాను చూడవద్దని ప్రజలు ప్రజలనే కోరారు. గతంలో అమీర్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2015లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మన దేశం చాలా సహనంతో ఉంటుంది. కానీ దుష్ప్రవర్తనను వ్యాప్తి చేసే వ్యక్తులు ఉన్నారు. అని అన్నారు. అమీర్ భార్య కిరణ్ రావు కూడా ఈ దేశంలో భద్రత లేదని వేరే దేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నామని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దాంతో కరోనా తర్వాత తీసిన లాల్‌సింగ్ చడ్డాను బాయ్‌కట్‌ చేశారు.

కాశ్మీర్ ఫైల్స్‌ వర్సెస్‌ ఇఫీ జ్యూరీ హెడ్‌ నాదవ్ లాపిడ్
నవంబర్‌ నెల్లో గోవాలో జరిగిన ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించబడింది. అయితే ఇఫీ ముగింపు వేడుకల్లో జ్యూరీ హెడ్‌ ఇజ్రాయెల్‌కు చెందిన నాదవ్ లాపిడ్‌ ప్రేక్షకులను ఉద్దేశించి ప్రచారం కోసం సినిమాలు చూడకండి అని మాట్లాడతంతో కాస్త వివాదంగా మారింది. దీంతో దర్శకుడు వివేక్ ఆగ్నహోత్రి స్పందిస్తూ ఈ అర్బన్ నక్సల్స్ అందరికీ మరియు ఇజ్రాయెల్ నుండి వచ్చిన లెజెండరీ ఫిల్మ్ మేకర్‌కి నేను సవాలు చేస్తున్నాను, వారు ఏదైనా ఒక్క షాట్, ఈవెంట్ లేదా డైలాగ్ పూర్తిగా నిజం కాదని నిరూపించగలిగితే, నేను సినిమా నిర్మాణం నుండి తప్పుకుంటాను. అని సవాలు విసిరారు. కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై చాలామంది బాయ్‌కట్‌ చేయాలని నిర్ణయించినా అది జరగలేకపోయింది.

రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్‌
ఈ యేడాది ప్రారంభంలో ఓ మ్యాగ్‌జైన్ కోసం రణ్‌వీర్ న్యూడ్‌గా పోజులిచ్చి వివాదంలో చిక్కుకన్నాడు. జూలై 21న ఈ ఫోటోలు ఆన్లైన్‌లో విడుదల చేశారు. ఇందులో ఒకటి బర్ట్ రేనాల్డ్‌ యొక్క ప్రసిద్ధ ఛాయాచిత్రాన్ని పునఃసృష్టిస్తూ నగ్నంగా రగ్గుపై పడుకొని ఫోటోలకు పోజులిచ్చాడు. దీంతో ముంబైలో అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ముంబై పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 292 సెక్షన్ అశ్లీల పుస్తకాల అమ్మకం మొదలైనవి, 293 సెక్షన్‌ యువకులకు అశ్లీల వస్తువుల అమ్మకం, సెక్షన్ 509 పదం, సంజ్ఞ లేదా చర్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి కాన్మన్‌ సుకేష్‌కి లింక్‌
సుఖేష్ చంద్రశేఖర్ పై రూ.200కోట్ల దోపిడి కేసుల్లో ఈడీ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను నిందితురాలిగా పేర్కొంది. ఇది ఇప్పటివరకూ ఓ కొలిక్కిరాలేదు. దీనిపై ప్రస్తుతం జాక్వెలిన్ బెయిల్‌పై విడుదల చేశారు. తాజాగా జాక్వెలిన్‌పై నోరాఫతేహి పరువునష్టం దావా వేసింది.

లైగర్ నిధుల విచారణ

ఈయేడాదిలో లైగర్‌ సినిమాలో హవాలా పెట్టుబడి పెట్టారని ఈడీ కి ఫిర్యాదు అందడంతో పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ చార్మికౌర్ విజయ్‌దేవరకొండను పలుమార్లు ఈడీ ఆధికారులు విచారణకు పిలిచారు. ఇందులో పెద్ద మొత్తంలో హవాలా డబ్బును సినిమాను నిర్మించడానికి ఉపయోగించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అధికారులు ఇంకా విచారణ జరుపుతున్నారు. లైగర్‌ సినిమాను కూడా బాయ్‌కట్‌ చేశారు. లైగర్‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ కేసులు 2023లో కూడా కొనసాగునున్నాయి.

ఇవి కూడా చదవండి…

గుడ్ న్యూస్ చెప్పిన చిరు

వాల్తేరు వీరయ్య..రవితేజ ఫస్ట్ లుక్‌

నేను స్టూడెంట్ సర్! మాయే మాయే…

- Advertisement -