ప్రతీ ఏడాది తెలుగులో డబ్బింగ్ సినిమాలు వస్తుంటాయి. కొన్ని మినహా అన్నీ చడిచప్పుడు లేకుండా వెళ్ళిపోతాయి. కానీ ఈ ఏడాది మాత్రం డబ్బింగ్ సినిమాలు తెలుగులో భారీ సౌండ్ చేసి ఊహించని కలెక్షన్స్ రాబట్టాయి. యష్ హీరోగా వచ్చిన ‘కేజీఎఫ్ 2’ అంచనాలకు మించి ఉండటంతో తెలుగులో భారీ వసూళ్ళు అందుకుంది. రెండు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇక నితిన్ తండ్రి తెలుగులో రిలీజ్ చేసిన కమల్ హాసన్ -లోకేష్ కనగారాజ్ ‘విక్రం హిట్ లిస్టు’ కూడా ఊహించని కలెక్షన్స్ తో తెలుగులో దుమ్ము లేపింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టి సుధాకర్ రెడ్డి కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఓవరాల్ గా కమల్ ఈజ్ బ్యాక్ అంటూ తెలుగులో కమల్ ఫ్యాన్స్ ఈ సినిమాను రిపీటెడ్ గా చూసి భారీ వసూళ్ళు అందించారు.
సైలెంట్ గా వచ్చిన కాంతార కూడా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్న వారానికి తెలుగులో రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అరవింద్ కూడా అంచనా వేయలేని విధంగా వసూళ్ళు అందుకుంది. శివ కార్తికేయన్ డాన్ , ధనుష్ ‘తిరు’ సినిమాలు కూడా తెలుగులో మంచి బుకింగ్స్ అందుకున్నాయి. ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ‘లవ్ టుడే’ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేసిన ఈ సినిమా నాలుగు రోజుల పాటు మినిమం బుకింగ్స్ తో తెలుగులో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది.
ఇవి కూడా చదవండి…