వెండితెరపై ఎన్నో సినిమాలు ప్రదర్శితమవుతాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. అలాంటి సినిమాలో టాప్5గా నిలిచిన ది బెస్ట్ సినిమాలుగా రికార్డు సృష్టించాయి. ఇందులో భాష భేదం లేకుండా ప్రేక్షకులను మైమరిపించిన సినిమాలు ఇవే…
ఖలా
అన్వితా దత్ దర్శకత్వం వహించిన సైకాలజికల్ డ్రామా. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్ తొలి చిత్రం. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రీ ప్రధాన పాత్రలో నటించారు. 1930 -1940 ల నాటి ఖలా అనే పేరుగల యువనేపథ్య గాయకుడి కథగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది.
సీతారామం
హను రాఘవపూడి తనదైన మార్క్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా సీతారామం. దుల్కర్ మృణాల్ ఠాకూర్ ప్రధానపాత్రలలో కనిపించారు. ఇది యుద్దంతో రాసిన ప్రేమకథ అని రాసిని డైలాగ్‌తో ప్రేక్షకులను మైస్మరైజ్ చేసింది. లెఫ్టినెంట్ రామ్ నుంచి సీతామహాలక్ష్మీకు చేరే చివరి ఉత్తరంతో కథ ప్రారంభమయి ఉత్తరం చేరడంతో సినిమా ముగుస్తుంది. ఒకే ఉత్తరం పాక్ నుంచి భారత్‌లోకి ఎలా వచ్చింది అనే ఇతివృత్తంతో నిర్మించిన సినిమా. ప్రస్తుతం ఇది డిస్నీ+హాట్‌స్టార్ మరియు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. చూడకపోతే చూసేయండి.
వీడ్కోలు (గుడ్‌బై)
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా గుడ్‌బై. వికాస్ బహ్ల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. పావైల్ గులాటి ప్రధాన పాత్రలో నటించారు.
777చార్లీ
కన్నడ నాట చిన్న సినిమాలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. అకోవలోకే చేరే సినిమా 777చార్లీ కన్నడం విజయవంతం కావడంతో భారతేదశమంతటా సంచలన రికార్డు సృష్టించింది. కిరణ్‌రాజ్ కే చేత నిర్మించబడిన ఈసినిమాలో రక్షిత్ శెట్టి సంగీత శృంగేరీ రాజ్‌బీ శెట్టి డానిష్ సైత్ బాబీ సింహా ప్రధాన పాత్రలు పోషించారు. మనిషికి కుక్కకి మధ్య ఉండే సంబంధంను ఈ సినిమాలో చాలా అందంగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా ప్రస్తుతం vootసెలెక్ట్‌లో ప్రసారం అవుతోంది.
భూల్ భూలయ్యా2
వరసగా ఫ్లాప్‌లతో సతమతవుతున్న వేళ బాలీవుడ్‌ను ఆదుకోవడానికి వచ్చిన ఒక శక్తిలా సినీ ప్రేక్షకులను అకట్టుకున్న సినిమా భూల్‌భూలయ్యా2. ఇది కామెడీ హారర్ సినిమాగా నిలిచింది. ఇందులో కార్తీక్ ఆర్యన్ కియారా అద్వానీ టబు ప్రధాన పాత్రలలో నటించారు. 2022లో అతిపెద్ద హిట్‌గా సినిమాగా నిలిచింది. ప్రస్తుతం ఈసినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.
ఇవి కూడా చదవండి…