జూన్ 22న తెలంగాణకు నైరుతి రుతుపవనాలు

445
niruthi
- Advertisement -

గత మూడు నెలలుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపశమనం కలిగించే వార్త. 21న ఏపీకి,22న తెలంగాణకు నైరుతి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాస్తవానికి జూన్ మొదటి వారంలోనే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవాల్సి ఉన్నా వాటి రాక ఆలస్యమైంది.

కేరళ తీరానికి రుతు పవనాలు ఆలస్యంగా తాకడమే కాదు, ఆరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను ప్రభావంతో తేమ తగ్గిపోయింది. రుతుపవనాల్లో తేమను తుఫాను లాగేసుకోవడంతో వాటి కదలిక ఆగిపోయింది. దీంతో తెలుగురాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించడానికి దాదాపు పదిహేను రోజులు పట్టనుంది.

నాలుగైదు రోజుల్లో గోవా, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ బంగాళా ఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం, ఒడిస్సాకు రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.అల్పపీడనం బలపడితే నైరుతి రుతు పవనాలు ఏపీ, ఒడిశాకు విస్తరించడం ద్వారా జల్లులు మొదలవుతాయని వివరించారు.

- Advertisement -