200 డిజైన్లు…10 రంగుల్లో బతుకమ్మ చీరలు

162
sarees
- Advertisement -

ఈ ఏడాది పంపిణీ చేసే బతుకమ్మ చీరల పంపిణీపై దృష్టిసారించింది ప్రభుత్వం. ఈసారి సిరిసిల్ల నేతన్నలకు ఈ సంవత్సరం ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించింది. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది.

200 డిజైన్లు,10 రంగుల్లో బతుకమ్మ చీరలను తయారు చేయనున్నారు. ఈ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. ఆగస్టు నాటికి ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది.

సిరిసిల్ల పరిశ్రమలోని 271 మ్యాక్స్‌, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల యజమానులకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఏడాది సిరిసిల్లకు 4.48 కోట్ల మీటర్లు, కరీంనగర్‌లోని గర్షకుర్తికి 14 లక్షలు, హనుమకొండకు 6.31 లక్షలు, వరంగల్‌కు 93 వేలు, మండేపల్లి టెక్స్‌టైల్‌ పార్కుకు 24 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించారు. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల కంటే ముందే చీరలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం.

- Advertisement -