Operation Pimple:ఇద్దరు ఉగ్రవాదులు హతం

5
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని కుప్వాడలో ఆర్మీ బలగాలు చేపట్టిన ఆపరేషన్ పింపుల్‌లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆర్మీ అధికారుల ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా సంస్థలు శుక్రవారం కుప్వారా జిల్లా కేరన్ సెక్టార్‌లో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి.

లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వెంట చొరబాటు యత్నం జరుగుతుందన్న ఖచ్చితమైన సమాచారం ఆధారంగా, శుక్రవారం కేరన్ సెక్టార్‌లో భద్రతా సంస్థలు సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి.అలర్ట్‌గా ఉన్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు కూడా కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించారు.

గత అక్టోబర్ 14న కూడా కుప్వారా జిల్లాలోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద చొరబాటు యత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసి, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ఆ సమయంలో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద అనుమానాస్పద కదలికలను సైనికులు గమనించి చర్య తీసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవు సుమారు 740 కిలోమీటర్లు, అంతర్జాతీయ సరిహద్దు 240 కిలోమీటర్లు ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్ బారాముల్లా, కుప్వారా, బండిపోరా జిల్లాల్లో మరియు జమ్మూ జిల్లాలోని కొంతభాగంలో ఉంటుంది. అంతర్జాతీయ సరిహద్దు జమ్మూ, సాంబా, కఠువా జిల్లాల గుండా కొనసాగుతుంది.

Also Read:SSMB29:రాజమౌళి మూవీ..బిగ్ అప్‌డేట్

- Advertisement -