ఆ రెండు ఆలయాల్లో ఆగస్టు 11నే ఇండిపెండెన్స్‌ డే!

1
- Advertisement -

ఆగస్టు 15న దేశమంతటా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు జరుగుతుండగా మధ్యప్రదేశ్‌లోని శివుడు మరియు గణేశుడికి అంకితం చేసిన రెండు ప్రసిద్ధ దేవాలయాలు మాత్రం నాలుగు రోజుల ముందే, అంటే ఆగస్టు 11న జాతీయ పండుగను ఘనంగా జరుపుకున్నాయి.మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లాలో ఉన్న పశుపతినాథ్ ఆలయం, ఉజ్జయినిలోని బడే గణేష్ ఆలయాలలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శ్రావణ కృష్ణ చతుర్దశి నాడు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం కాకుండా, హిందూ పంచాంగం ప్రకారం వేడుకలు నిర్వహించే అరుదైన సాంప్రదాయాన్ని ఈ క్షేత్రాలు పాటిస్తున్నాయి.

ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం… భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం వచ్చిన రోజు (ఆగస్టు 15, 1947) హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ తిథి ఎప్పుడు వస్తే ఆ రోజే స్వతంత్ర భారత పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాదిన హిందూ తిథి ప్రకారం ఆగస్టు 11న శ్రావణ కృష్ణ చతుర్దశి వచ్చింది.

పశుపతినాథ్ ఆలయం, మందసౌర్..ఇండోర్‌కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో, శివ్నా నదీ తీరాన ఉన్న ప్రాచీన పశుపతినాథ్ ఆలయంలో మంగళవారం (ఆగస్టు 11) స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ ఆలయంలో 1985 నుండి తిథి ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే సంప్రదాయం నడుస్తోంది.ప్రత్యేక రుద్రాభిషేకం.. జ్యోతిష మరియు కర్మకాండ పరిషత్ అధ్యక్షుడు ఉమేష్ జోషి తెలిపిన వివరాల ప్రకారం… ఇక్కడి అష్టముఖ శైవ లింగానికి వేద మంత్రోచ్ఛారణల మధ్య ‘దూర్వా’ (గరిక) నీటితో ప్రత్యేకంగా అభిషేకం చేశారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్: పరమశివునికి గరిక నీటితో అభిషేకం చేయడం వల్ల దేశానికి ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఈ సందర్భంగా ప్రార్థించినట్లు పూజారులు తెలిపారు. భక్తులకు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసాద వితరణ చేశారు.

Also Read:టెక్నాలజీ నన్ను కాపాడింది!

బడే గణేష్ ఆలయం, ఉజ్జయిని..ఉజ్జయినిలోని జగత్ ప్రసిద్ధ బడే గణేష్ ఆలయంలో కూడా మంగళవారం భక్తిశ్రద్ధలు, దేశభక్తి ఉత్సాహాల మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు.గణనాథుడే రాజ్యానికి దేవుడు.. ఈ ఆలయంలో గణపతిని “గణతంత్ర దేవుడు” గా పూజిస్తారు.త్రివర్ణ పతాక యాత్ర: ఆగస్టు 11న డప్పు వాయిద్యాలు, దేశభక్తి నినాదాల నడుమ ఆలయం వరకు ‘తిరంగా యాత్ర’ తీశారు. ఆలయ శిఖరంపై జాతీయ జెండా…స్వామివారికి జాతీయ జెండాను సమర్పించి, ప్రత్యేక ‘మహా హారతి’ ఇచ్చారు. అనంతరం ఆలయ ముఖ్య శిఖరంపై మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

- Advertisement -