‘2.ఓ’.. మోత మోగిస్తున్న మొదటి వీడియో సాంగ్‌

109
2.O First Video Song

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అమీజాక్స్ కథానాయికగా నటిస్తున్న చిత్రం 2.ఓ. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 29వ తేదీన విడుదల రానుంది. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందడంతో, అందరి దృష్టి ఈ సినిమాపైనే వుంది.

2.O First Video Song

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 6,800 థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ఇక రిలీజ్ నాలుగు రోజులే ఉండ‌డంతో మేక‌ర్స్ సినిమాపై ఆస‌క్తి పెంచేందుకు జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుండి ‘యంతరలోకపు సుందరి’ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు చిత్ర బృందం.

తెలుగులో ఈ పాటని సిడ్ శ్రీరామ్, షాషా త్రిపాఠి పాడారు. ఈ పాటలోని సెట్స్‌, రోబోల్లా.. రజనీ, అమీ చేసిన డ్యాన్స్ వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎఆర్ రెహ్మన్ సంగీతం ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ర‌జ‌నీకాంత్‌, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం రిలీజ్‌కి ముందే క‌లెక్ష‌న్స్‌ని రాబ‌డుతుంది. బాహుబ‌లి2 రికార్డ్స్‌ని ఈ చిత్రం చెరిపేస్తుంద‌ని సినీవరగాల్లో టాక్‌.