ఎన్టీఆర్ బయోపిక్‌లో RX 100 బ్యూటి..!

268
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రఖ్యాత నటుడు నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు క్రిష్ ఎన్టీఆర్ అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా రానున్న ఈ చిత్రం జనవరి 9న ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’, జనవరి 24న ‘యన్.టి.ఆర్- మహానాయకుడు’గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రోజుకోవార్తతో టీ టౌన్‌లో సెన్సేషన్‌గా మారింది ఎన్టీఆర్ బయోపిక్. ఈ మూవీలో RX 100 భామ పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.

Payal Rajput

RX 100 మూవీలో హీట్‌ పుట్టించే ఇందూ పాత్రతో యువతను ఆకట్టుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే తదుపరి చిత్రల విషయంలో ఈ అమ్మడు ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటోంది. ఆ మధ్య సి కళ్యాణ్ నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒకటి చేస్తుందనే టాక్ వచ్చింది కాని అది ఇంకా పట్టాలెక్కలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం పాయల్ రాజ్ పుత్ ఎన్టీఆర్ కథానాయకుడులో ఒక ప్రత్యేక పాత్ర చేయడానికి సైన్ చేసినట్టు తెలిసింది. ఆ పాత్ర ఎవరిదో కాదు సహజనటి జయసుధది.

Payal Rajput

ఇక ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ చాలా హిట్‌ సినిమాలే ఉన్నాయి. అందులో డ్రైవర్ రాముడు సినిమా మంచి విజయం సాధించింది. అంతేకాదు వీరి కాంబినేషన్‌లో యుగంధర్-అనురాగ దేవత-కేడి నెంబర్ వన్-లాయర్ విశ్వనాధ్-రామకృష్ణులు లాంటి ఎన్నో సూపర్ హిట్స్‌లో వచ్చాయి. ఎన్టీఆర్‌తో మంచి సాన్నిహిత్యం ఉన్న అతి కొద్ది కథానాయికల్లో జయసుధ గారిది ప్రత్యేక స్థానం. అందుకే దర్శకుడు క్రిష్ కొంత కాలం వెయిట్ చేసి మరీ పాయల్‌తో ఈ రోల్‌ చేయించుకున్నట్టు సినీవర్గాల సమాచారం.

- Advertisement -