బుమ్రా స్థానంలో హైదరాబాదీ..

289
mohammed-siraj

72 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతు ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకున్న భారత్ త్వరలో జరిగే వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ టెస్టు సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన బుమ్రాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు హైదరాబాదీ పాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించారు.

వ‌న్డే సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ టూర్‌కు కూడా బుమ్రాకు రెస్ట్ ఇస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. ఈ రెండు సిరీస్‌లలో బుమ్రా స్థానంలో జట్టులో సిరాజ్‌కు చోటు కల్పించింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో జ‌రిగే మూడు టీ20ల‌కు సిద్ధార్ధ్ కౌల్‌ను జ‌ట్టులోకి తీసుకున్నారు.

బుమ్రా ఆసీస్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో మొత్తం 21 వికెట్లు తీసుకున్నాడు. అయితే వ‌ర్క్‌లోడ్ ఎక్కువ కావ‌డం వ‌ల్ల అత‌నికి రెస్ట్ ఇస్తున్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.