రివ్యూ: 2.0

285
2.0 MOVIE REVIEW
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 2.0. శంకర్ నాలుగేళ్ల కష్టం,దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఓ వైపే రజనీ మేనియా..మరోవైపు సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ ని శంకర్ అందుకున్నారా..?రోబోతో మ్యాజిక్ చేసిన వీరిద్దరూ 2.0తో అదే మ్యాజిక్ రిపీట్ చేశారా..?ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం …

కథ:

ఉన్నట్లుండి భూమీ మీద ఉన్న అంద‌రి సెల్‌ఫోన్లూ మాయ‌మైపోతుంటాయి. ఏం జరుగుతుందో తెలియక ప్రపంచమంతా నివ్వేరపోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గ్ర‌హిస్తారు. ఓ ప‌క్షి ఆకార‌పు రూపం ఇదంతా చేస్తుందని గ్రహించి దానిని ఆపడానికి చిట్టి ద రోబోని రంగంలోకి దించుతారు. చిట్టి ఆ ప‌క్షి(అక్ష‌య్
కుమార్‌)ని ఎలా ఎదుర్కొంది? కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.

2.0 movie review

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ విజువల్ ఎఫెక్ట్,ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్,చిట్టి – ప‌క్షిరాజు పోరాటాలు. సినిమాకు సెంటర్ ఆఫ్‌ అట్రాక్షన్‌ రజనీకాంత్. రజనీ స్టైల్‌కి సెల్యూట్ చేయాల్సిందే. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ క‌థ అల్లారు. ఫస్టాఫ్‌లో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం సూపర్బ్. చిట్టి రంగ ప్ర‌వేశం చేసిన తర్వాత సినిమా ఓ రేంజ్‌కి వెళ్తుంది.
విలన్‌ పక్షిరాజుగా అదరగొట్టాడు అక్షయ్ కుమార్. తన గెటప్‌తో ఆకట్టుకున్నారు. సినిమాకు మరో ప్లస్ పాయింట్ అమీ జాక్సన్. తన గ్లామర్‌తో సినిమాకు మరింత అందం తెచ్చింది. మిగితా నటీనటులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఎమోషన్స్ లేకపోవడం,షాకింగ్ ఎలిమెంట్స్ త‌క్కువ‌. క‌థ‌ని ర‌జ‌నీ – అక్ష‌య్‌ల పోరాటం మ‌ధ్యే తిప్ప‌డంతో మిగిలిన పాత్ర‌లు తేలిపోయాయి.కొన్ని స‌న్నివేశాలు రోబోలో చూసిన‌ట్టే అనిపిస్తుంటాయి. కొన్ని స‌న్నివేశాల్లో గ్రాఫిక్స్ అబ్బుర‌ప‌రుస్తాయి కొన్నిచోట్ల చోట్ల సాదాసీదాగా సాగాయి. అయితే శంక‌ర్ ఈసారి ఎమోష‌న‌ల్ గా ఈ క‌థ‌ని
మ‌ల‌చలేక‌పోయాడు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో శంకర్ కష్టం తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. శంకర్ విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రేక్ష‌కుల్ని మాత్రం అబ్బుర‌ప‌రుస్తాయి. త్రీడీలో చూడ‌గ‌లిగితే… ఆ ఎఫెక్ట్స్ మ‌రింత బాగుంటాయి. పాట‌లు పర్వాలేదు. ఆర్‌.ఆర్‌లో రెహ‌మాన్ మార్క్ క‌నిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. ప్ర‌తీసారీ బ‌ల‌మైన క‌థ‌ని ఎంచుకుంటూ సినిమాలు
తీసే శంక‌ర్ ఈసారి కేవ‌లం టెక్నాల‌జీకే పెద్ద పీట వేశాడు. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

2.0 movie review

తీర్పు:

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రజనీ-శంకర్ 2.0 ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకువచ్చింది. సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌కు సాంకేతికతను జోడించి శంకర్ తెరకెక్కించిన చిత్రం 2.0. సెల్ ఫోన్‌ల వ‌ల్ల వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో క‌ళ్ల‌కు క‌ట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ అద్భుతమైన విజువల్‌ వండర్‌ని తెరకెక్కించారు శంకర్‌. ఓవరాల్‌గా ప్రేక్షకులను ఫిదా చేసే అద్భుత విజువల్ వండర్ 2.0

విడుదల తేదీ:29/11/18
రేటింగ్: 3.25/5
నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
దర్శకత్వం: శంకర్‌

- Advertisement -