బన్నీ 96…కళ్యాణ్ రామ్‌ 118

267
allu arjun kalyan ram
- Advertisement -

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి-త్రిష కాంబినేషన్‌లో భారీ హిట్ సాధించిన చిత్రం చిత్రం 96. 1996లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకుల మన్ననలు పొందింది. మద్రాస్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని నందగోపాల్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా తెలుగులో రీమేక్‌గా రానున్న సంగతి తెలిసిందే.

తెలుగు రీమేక్‌ రైట్స్‌ని నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను అల్లు అర్జున్‌తో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. నాపేరు సూర్య నాఇల్లు ఇండియా తర్వాత ఏ సినిమాకు కమిట్ కానీ బన్నీ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. 96 తమిళ సినిమా చూసిన దగ్గర నుంచి అల్లు అర్జున్ ధ్యాస అంతా కూడా ఈ సినిమాపైనే ఉందట. అంతేగాదు వైవిధ్యమైన సినిమాలు చేస్తే త‌న కెరీర్ లో ఎప్ప‌టికి గుర్తిండిపోతాయ‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట అల్లు అర్జున్. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ అఫిషియల్ కన్ఫర్మేషన్ వస్తే బన్నీ ఫ్యాన్స్‌కి పండగే.

మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ సైతం ఆసక్తికర టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకువస్తున్నారు. కెవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు 118 అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్,షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తుండగా శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. మొత్తంగా ఈ టాలీవుడ్ నెంబర్‌ గేమ్‌లో ఎవరు సక్సెస్‌ కొడతారో అన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

- Advertisement -