నింగిలోకి పీఎస్‌ఎల్వీ సీ-43

240
pslv c 43
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగాన్ని జరిపింది. ఇవాళ ఉదయం 9.58 గంటలకు ఏకకాలంలో 31 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-43 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇస్రో ప్రారంభించిన 28 గంటల కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. హైసిస్‌తో పాటు ఆ రాకెట్‌పై 30 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి ప్రయోగించింది.

అమెరికాకు చెందిన 23 చిన్న ఉపగ్రహాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, ఫిన్ ల్యాండ్, కొలంబియా, మలేసియా, నెదర్లాండ్స్, స్పెయిన్ దేశాలకు చెందిన ఉపగ్రహాలున్నాయి. పీఎస్‌ఎల్వీ-సీ43 మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం అయిన హైసిస్‌ను ఇస్రో అభివృద్ధి చేసింది. 380 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని.. భూమికి 636 కి.మీ. ఎత్తులో ఉన్న పోలార్ సన్ సింక్రొనస్ ఆర్బిట్‌లో 97.957 డిగ్రీల ఒంపు వద్ద ప్రవేశపెడతారు.

ఈ మిషన్ జీవితకాలం ఐదేండ్లు. భూమి విద్యుదయస్కాంత క్షేత్రంలోని చిన్న చిన్న తరంగదైర్ఘ్య పరారుణ ప్రాంతాలను, పరారుణ ప్రాంతంలో కనిపించే భూ ఉపరితలాన్ని పరిశీలించడం హైసిస్ ఉపగ్రహం ప్రధాన లక్ష్యం. గతంలో ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

- Advertisement -