53 లక్షల నిధులతో కదిలి ఆలయ అభివృద్ది- మంత్రి అల్లోల

23
Minister Indira Reddy

నిర్మల్ కదిలి పాపహారేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.. ఆలయ చైర్మన్ గా నార్వాడి భుజంగ రావు, డైరెక్టర్ లు ప్రమాణ స్వీకారం చేశారు.. కదిలి పాప హారేశ్వరా స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కదిలి ఆలయాన్ని 53 లక్షల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని గతంలో ఆలయానికి రావడానికి వంతెన సదుపాయం లేక నీటిలో నడిచి వచ్చేవారని ఇప్పుడు వంతెన అందుబాటులోకి వచ్చిందన్నారు. త్వరలోనే కాంపౌండ్ వాల్, రాజా గోపురం, షెడ్డు, నిర్మిస్తామని అన్నారు. బీరవేల్లి నుండి వయా ప్యారమూర్ కదిలి, మాడేగం, దీలవార్ పూర్ వరకు డబుల్ రోడ్డు సైతం రాబోతుందని అన్నారు.

అలాగే నిర్మల్ జిల్లా దీలవార్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో రూ.36 లక్షల నిధుల తో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి శనివారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సముందర్ పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవం, హనుమాన్ మందిర శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.