దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..

61
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 1,94,720 కేసులు న‌మోదుకాగా 442 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టీవ్ కేసులుండగా దేశంలో మొత్తం 4,868 ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. 29 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. 120 జిల్లాల్లో రోజూ 10 శాతం మేర పాజిటివిటీ రేటు న‌మోదయ్యాయని వెల్లడించారు. ఒమిక్రాన్ వేర‌యంట్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై రేపు దేశంలోని ముఖ్య‌మంత్రులతో ప్ర‌ధాని బేటీ కానున్నారు.