- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 18,257 కరోనా కేసులు నమోదుకాగా 42 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,36,22,651 కు చేరగా 4,29,68,533 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 1,28,690 యాక్టివ్ కేసులుండగా 5,25,428 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.22 శాతానికి పెరుగగా మొత్తం కేసుల్లో 0.30 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 198.76 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
- Advertisement -