175 విత్ జనసేన.. కమలం క్లారిటీ!

52
- Advertisement -

ఏపీలో ప్రస్తుతం 175 స్థానాలకు సంబంధించిన చర్చ జోరుగా జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 175 స్థానాల్లోనూ వైసీపీ పోటీ చేసి గెలుస్తుందని, టిడిపి, జనసేన పార్టీలకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా ? అంటూ సవాల్ విసిరారు. అయితే జగన్ చేసిన సవాల్ పై టీడీపీ జనసేన నుంచి ఘాటు విమర్శలే వస్తున్నాయి. దమ్ముంటే 175 నియోజిక వర్గాల్లో రోడ్లు వేయండి, దమ్ముంటే 175 నియోజిక వర్గాల్లో రోడ్లపై పర్యటించండి అంటూ జగన్ పై కౌంటర్లు జనసేన నేతలు.. ఇక టీడీపీ కూడా ఇదే రేంజ్ లో జగన్ సవాల్ పై ఫైర్ అవుతోంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జగన్ సవాల్ పై విమర్శలు గుపిస్తున్నాయి తప్పా.. 175 స్థానాల్లో పోటీ చేయబోతున్నది లేనిది మాత్రం స్పష్టం చేయడం లేదు టీడీపీ, జనసేన పార్టీలు.

అయితే ఏపీ బీజేపీ మంత్రం ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది. ఏపీలోని 175 స్థానాల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కర్నూల్ లో జరిగిన మీడియా సమావేశంలో విష్ణు వర్ధన్ రెడ్డి పై విధంగా చెప్పుకొచ్చారు. కాగా విష్ణు వర్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎందుకంటే జనసేన టీడీపీ మద్య పొత్తు వ్యవహారం అసలు ఉంటుందా ఉండదా ? అనే సందేహాల నడుమ రోజుకొక మలుపు తిరుగుతోంది. కానీ తాము బీజేపీతోనే ఉన్నామని జనసేన చెబుతోంది. అటు బీజేపీ కూడా పవన్ మాతోనే ఉన్నాడని క్లారిటీ ఇస్తోంది.

అయితే పవన్ చూపు మాత్రం టీడీపీ వైపే ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యం జనసేనతో కలిసి 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని కమలనాథులు క్లారిటీ ఇవ్వడంతో, టీడీపీతో జనసేన పొత్తు ఉండే అవకాశం లేదా అనే డౌట్ వస్తోంది. ఇంకో విషయం ఏమిటంటే టీడీపీతో కలవడానికి బీజేపీ అసలు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నాడు అనేది హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతోంది. మొత్తానికి 175 స్థానాల్లో జనసేనతో కలిసి పోటీ చేయబోతున్నాట్లు బీజేపీ ప్రకటించడంతో.. పవన్ ఆలోచనలో పడే అవకాశం ఉంది. మరి పవన్ బీజేపీతోనే ఉంటాడా ? లేదా టీడీపీ వైపు మొగ్గు చూపుతాడా ? ఇంకా బీజేపీ, టీడీపీ పార్టీలను కలిపే ప్రయత్నం చేస్తాడా ? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరి జనసేనాని ఏం చేస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి…

జగన్ ఒంటరి పోరు.. అసలు కారణం అదే!

వచ్చే ఎన్నికల్లో యుద్దమే !

చిరు వెంట బీజేపీ.. మెగాస్టార్ నమ్ముతారా?

- Advertisement -