దేశంలో 24 గంటల్లో 17,070 కరోనా కేసులు

58
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదుకాగా 23 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,34,69,234కు చేరగా 4,28,36,906 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,07,189 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 5,25,139 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.40 శాతానికి పడిపోగా మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.55 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది.

- Advertisement -