- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టి కాస్త రిలీఫ్ కాగా ఇప్పుడు సరికొత్త సమస్య వచ్చి పడింది. వర్షాలతో వరదనీరు నిలిచి ఉండటంతో దోమల బెడద పెరిగి డెంగీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే 163 మందికి డెంగీ జ్వరాలు సోకడంతో వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
డెంగీ జ్వరాలతో పాటు 14 చికున్ గున్యా, 54 మలేరియా కేసులు నమోదయ్యాయి. యమునానది వరదనీరు నిలిచిన ప్రాంతాల్లో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Also Read:కేసిఆర్ అలా చేస్తే సంచలనమే..?
జ్వరాలు, వాంతులు, ఒళ్లు నొప్పులతో రోగులు ఆసుపత్రులకు వస్తున్నారని, వరదల వల్ల డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలవచ్చని వైద్యులు వెల్లడించారు.
Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే. ఇలా చేయాల్సిందే!
- Advertisement -