16న 100 డేస్‌ ఆఫ్ లవ్‌

271

ఎవ‌ర్ గ్రీన్ పెయిర్ దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్య‌మీన‌న్ జంట‌గా రానున్న 100డేస్ ఆఫ్ ల‌వ్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే ఆడియో విడుద‌ల చేసుకున్న ఈ సినిమాను ఆగ‌స్టు 26న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి మేక‌ర్స్ నిర్ణ‌యించారు.

జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళం లో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే.తెలుగులోనూ అంతటి ఘ‌న విజ‌యాన్ని సాధిస్తామ‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు చిత్ర యూనిట్. ఆల్రెడీ రిలీజ్ డేట్ ను క‌న్ఫార్మ్ చేసుకున్న ఈ సినిమాతో నిత్య మీన‌న్ త‌న మేనేజ‌ర్ అయిన వెంక‌ట్ ను ప్రొడ్యూస‌ర్ గా ప‌రిచ‌యం చేస్తున్న ఈ సినిమాపై నిత్య బాగానే కేర్ తీసుకుంటుంది. ఇప్ప‌టికే మంచి ఊపు మీదున్న ప్ర‌మోష‌న్స్ లో, మ‌రో రెండు రోజుల్లో నిత్య మీన‌న్, దుల్క‌ర్ సల్మాన్ లు కూడా పాల్గొన‌నున్నారు.

ఓకే బంగారం సినిమాతో యూత్ ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అంద‌రికీ మంచి అంచనాలే ఉన్నాయి.