సింధును చూసి దేశం గర్విస్తోంది….

624
- Advertisement -

ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు త్వరలో స్పోర్ట్స్‌ పాలసీ తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సింధు  విజయోత్సవ సభలో మాట్లాడిన కేటీఆర్ సింధు, సాక్షి భారత దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచం ముందు నిలబెట్టారని అన్నారు. సింధును చాంపియన్‌గా తయారుచేసిన గోపిచంద్ కు కృతజ్ఞతలు తెలిపారు. సింధు తల్లిదండ్రుల త్యాగాలు కష్టాలు వెలకట్టలేనివని….సింధును చూసి దేశం గర్విస్తోందని కేటీఆర్ అన్నారు. సింధుకు పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చిన వివిధరాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.

2020లో  టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌ కోసం ఇప్పటినుంచి ప్రణాళిక రూపొందించాలని అన్నారు. సింధు లాంటి చాంపియన్స్‌ను కచ్చితంగా తయారుచేస్తామని తెలిపారు. క్రీడలకు ప్రభుత్వా పరంగా ప్రొత్సాహం ఇచ్చి తీరుతామని తెలిపారు. త్వరలో స్పోర్ట్స్  పాలసీ తీసుకొస్తామని తెలిపారు. సిల్వర్‌ మెడల్ సాధించిన సింధు, సింధు వెనక కొండలా ఉన్న గోపిచంద్‌కు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

దేశ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సింధు, సాక్షి మాలిక్‌ దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తం చేశారని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కొనియాడారు. సింధు ఒలింపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ తీసుకురాకపోయినా.. దేశానికి ఆమే ఒక బంగారమని కొనియాడారు. సింధు ఫైనల్లో పోటీ పడుతున్న సమయంలో దేశమంతా ఒక్కటై ఆ మ్యాచ్‌ను వీక్షించిందని గుర్తుచేశారు.

అంతకముందు వెండికొండను అభినందించేందుకు క్రీడాభిమానులు భారీగా తరలివచ్చారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సింధు విజయోత్సవయాత్ర అట్టహాసంగా సాగింది. దారి పొడవునా బాణ సంచాకాలుస్తూ… ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. జయహో సింధు అంటూ నినదించారు. అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ సింధు, కోచ్‌ గోపీచంద్‌ ముందుకు సాగారు.

 

- Advertisement -