చుట్టాలబ్బాయి సంతోషాన్నిచ్చింది

635
- Advertisement -

ఆది హీరోగా హిట్‌ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్‌ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై వెంకట్‌ తలారి, రామ్‌ తాళ్లూరి నిర్మించిన చిత్రం.’చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 19న. రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌ల్లో ఒక‌రైన వెంకట్ తలారి సినిమా గురించి మాట్లాడుతూ “నిర్మాతగా తొలి చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఉత్సాహాన్నిస్తుంది. సినిమా విడుదలైన రోజు నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. విడుదల రోజున 350 థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో ఇప్పుడు మరో వంద థియేటర్స్ ను పెంచుతున్నాం. మొదటి మూడు రోజుల్లో ఆరు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. మరో రెండు రోజుల్లో మేం పెట్టిన డబ్బు వచ్చేస్తుంది.

సాయికుమార్ గారు, ఆది కలిసి నటించడం ఒక ప్లస్ అయితే, థమన్ మ్యూజిక్ సినిమాకు మరో ఎసెట్ అయ్యింది. కామెడి బాగా పండింది. ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు సినిమా బావుందని అంటున్నారు. అలాగే నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుగారు సినిమా బావుందని అప్రిసియేట్ చేస్తున్నారు. అలాగే గ్రంధి మల్లిఖార్జునరావు గారు సినిమా చూశారు. మరి కొంత మంది ప్రముఖులు కూడా సినిమా చూడాలని అంటున్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. తిరుపతి, నెల్లూరు, కడప, వైజాగ్, విజయవాడ, గుంటూరు ఇలా నాలుగైదు రోజుల పాటు యూనిట్ సభ్యులు ప్రేక్షకులను కలిసే ప్లాన్ చేస్తున్నాం. మా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్ బ్యానర్ లో వీరభద్రమ్ గారి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే మరికొన్ని చిత్రాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం“ అన్నారు.

- Advertisement -