వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..

153
- Advertisement -

పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా పోలీసులు అరెస్టు చేసిన వనమా రాఘవను కోర్టులో హాజరుపరిచారు. దీంతో అతనికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతనిని భద్రాచలం జైలుకు తరలించారు. కాగా, రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. గతంలో అతడిపై 11 కేసులు ఉన్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.

రాఘవ ఎపిసోడ్‌లో మరో కొత్త దురాగతం వెలుగులోకి వచ్చింది.. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ప్రజా ప్రతినిధితో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాసలీలలు బయటపడ్డాయని సమాచారం.. ఈ సమాచారం తెలిసి అక్కడికి మీడియా ప్రతినిధులు చేరుకున్నారు. అయితే విషయం బయటికి రాకుండా మీడియా ప్రతినిధులతో సెటిల్మెంట్ చేసుకున్నారని ఆరోపణ. ఈ సెటిల్మెంట్ కోణం గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -