ఆర్బీఐ జూలై నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిలీజ్ చేసింది. మొత్తం 14 రోజులు జూలైలో బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఇవి దేశంమొత్తం ఒకే రోజు సెలవులు కావు. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పండుగల ప్రకారం ఈ సెలవుల జాబితాను ఆర్ బీఐ జారీ చేస్తుంది.
ప్రతీ నెలలో రెండు శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేయవు. ఈనెలలో మొత్తం ఐదు ఆదివారాలు వచ్చాయి. రెండు శనివారాలతో కలిపితే సాధారణ సెలవులు ఏడు ఉన్నాయి. బక్రీద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. జూలై 1న కాంగ్ (రథయాత్ర)/రథయాత్ర (భువనేశ్వర్-ఇంఫాల్‌లో బ్యాంక్ మూసివేస్తారు), జూలై 5న(మంగళవారం) గురు హరగోవింద్ సింగ్ జీ ప్రకాష్ దివాస్ (జమ్మూ, కాశ్మీర్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 7న ఖర్చి పూజ (అగర్తలాలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 11న ఈద్-ఉల్-అజా (జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు). జూలై 13న భాను జయంతి (గ్యాంగ్‌టక్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 14న బెన్ డియెంక్లామ్ (షిల్లాంగ్ బ్యాంక్ మూసివేస్తారు). జూలై 16న హరేలా (డెహ్రాడూన్ బ్యాంక్ మూసివేస్తారు).