కర్ణాటకలో 14 రోజుల లాక్ డౌన్‌….

301
karnataka
- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ విజృంభనతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్‌, నైట్ కర్ఫ్యూ బాటపట్టగా తాజాగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మంగ‌ళ‌వారం నుంచి రెండు వారాల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు సీఎం యెడియూరప్ప. ఈ సంద‌ర్భంగా క్లోజ్ డౌన్ అనే ప‌దం ఆయ‌న వాడారు. ప్ర‌తి రోజూ ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల దుకాణాల‌కు అనుమ‌తి ఇచ్చారు.

ఎమ‌ర్జెన్సీ అయితే త‌ప్ప రాష్ట్రంలో కానీ, ఇత‌ర రాష్ట్రాల‌కు కానీ ప్ర‌యాణాల‌ను అనుమ‌తించ‌రని వెల్లడించారు. ప్రజలంతా లాక్ డౌన్‌కు సహకరించాలని అప్పుడే కరోనాను అరికట్టగలమని తెలిపారు. కర్ణాటకలో కేసుల సంఖ్య 13.39 ల‌క్ష‌ల‌కు, మ‌ర‌ణాల సంఖ్య 14,426కు చేరింది. సీఎం యెడియూరప్ప ఇప్పటికే రెండు సార్లు కరోనా బారీనపడి కోలుకున్నారు.

- Advertisement -