- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 13,166 కరోనా కేసులు నమోదుకాగా 302 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,28,94,345కు చేరగా 4,22,46,884 మంది కరోనా నుండి కోలుకున్నారు.
దేశంలో ప్రస్తుతం 1,34,235 యాక్టివ్ కేసులుండగా 5,13,226 మంది బాధితులు మృతిచెందారు. మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా దేశవ్యాప్తంగా 1,76,86,89,266 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -